జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 07 at 10.23.57

TRINETHRAM NEWS

Minister Uttamkumar Reddy will visit Medigadda today

Trinethram News : హైదరాబాద్ : జూన్ 07
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడి గడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట మరమ్మ తులను ఉత్తమ్ సమీక్షించ నున్నారు.

ఎన్​డీఎస్​ఏ కమిటీ సిఫార్సు ల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకోనున్నారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజినీర్లతో కలిసి పనులపై ఆరా తీయను న్నారు.

మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేది కలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద మరమ్మతు లు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

మేడిగడ్డ ఆనకట్టలో కీలక మైన గేట్ల ఎత్తివేత పనులు చేస్తున్నారు. ఏడో బ్లాకు లోని ఎనిమిది గేట్లకు గాను ఒక గేటును గతంలోనే ఎత్తగా… కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కటింగ్ ద్వారా తొలగిస్తు న్నారు.

మిగిలిన ఆరు గేట్లలో 16, 17వ గేట్లను ఎత్తినట్లు ఇంజనీర్లు తెలిపారు. గతంలో 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపివేసి… అన్నింటిని సరిచేసిన తర్వాత గురువారం ఎత్తారు.

మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే తరహాలో ఆ గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Uttamkumar Reddy will visit Medigadda today

You cannot copy content of this page