TRINETHRAM NEWS

Ramagundam Police Commissionerate

ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రజారక్షణే మా ధ్యేయం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని, మంచిర్యాల జోన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలం లో కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని కొన్నిలోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి అయి, ఆస్తి నష్టం మరియు పశువులకు ప్రాణ నష్టం జరుగుచున్నది.మనుషులు వరదలలో చిక్కుకుని ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇట్టి ఇబ్బందులను అధిగమించుటకు గాను, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ యం.శ్రీనివాస్, ఐపియస్.,ఆదేశం ప్రకారం, మంచిర్యాల డిసిపి.అశోక్ కుమార్, ఐపియస్ చొరవ తీసుకొని సమస్యను మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ బి. సంతోష్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ వ్యక్తిగత శ్రద్ద వహించి, ఫ్లడ్ రెస్క్యూ టీం కు కావలసిన వస్తువులు కొనుగోలు చేయుటకు నిధులు మంజూరు చేయడం జరిగినది. ఇట్టి నిధులతో 1) 10 seater boat with 5HP motor, 2) Lifebuoys -10, 3) Sea master life jackets 50, 4) Medical stretchers -5 మరియు 5) Wood cutter-4 పరికరాలు కొనుగోలు చేసి, ఇట్టి పరికరాలను మంచిర్యాల డిసిపి కార్యాలయంలో, రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల కలెక్టర్ ఆద్వర్యం లో, మంచిర్యాల డిసిపి అందజేయడం జరిగినది ఇట్టి సమావేశం లో శ్రీనివాస్ ఐపీస్ మాట్లాడుతూ ప్రజల ధన, ప్రాణ రక్షణ మా ధ్యేయమని, మంచిర్యాల జిల్లా పరిధిలో, సుశిక్షితులైన 44 సభ్యులతో ఫ్లడ్ రెస్క్యూ టీం తయారు చేయడం జరిగిందని, ఈ టీం యొక్క సభ్యులు ఈ చుట్టుపక్కల ఎక్కడ వరద సమస్యలు వచ్చిన అందుబాటులో ఉండి ప్రజల యొక్క ఆస్తి, ప్రాణ రక్షణలో పాలు పంచుకోగలరని ప్రజలకు విన్నవించడం జరిగినది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Police Commissionerate