జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 11 at 4.47.54 PM

TRINETHRAM NEWS

Trinethram News : on December 11, 2023

ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నిరుద్యోగులకు తీపి కబురు.. రెండు రోజుల్లో సీఎం రేవంత్‌ సమీక్ష

తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని టీఎ‍స్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి.. అంటే 2014 నుంచి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

గత ఏడాదిన్నరగా.. టీఎస్‌పీఎస్సీలో పేపర్ల లీక్‌లు, ఆపై పరీక్షల వాయిదాల వ్యవహారంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

You cannot copy content of this page