Telangana District Judge Mohan Rao died in a road accident
Trinethram News : కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం..చెందాడు.
జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు ఢీ కొనడంతో ఆగి ఉన్న వ్యాన్ లోకి కారు.. దూసుకెల్లింది. జడ్జి మోహన్ రావుతో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఏపీలో ఇవాళ వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్ అయ్యారు. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App