TRINETHRAM NEWS

If you get 97 marks, you scored 77.. Ishta Rajya in the evaluation of inter papers

Trinethram News : హైదరాబాద్ : ఇంటర్మీడియేట్ వాల్యువేషన్ ప్రక్రియలోని లోపాలు బయటపడుతున్నాయి. ఓ మెరిట్ స్టూడెంట్​కు వందకు 97 మార్కులు వస్తే.. 77 మార్కులు మాత్రమే వేశారు.

ఈ బాగోతం రీవెరిఫికేషన్లో బహిర్గతమైంది. ఎగ్జామినర్ చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకో తప్పు చేశారు. హైదరాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో సంహిత ఎంఈసీ సెకండియర్ చదువుతున్నది. ఇటీవల రిలీజ్ అయిన ఇంటర్ పరీక్షల్లో ఆమెకు 926 మార్కులు వచ్చాయి. అయితే అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమెకు కామర్స్ లో మాత్రం 77 మార్కులే వచ్చాయి. మంచి మార్కులు వస్తాయని భావించిన ఆమె.. తక్కువ మార్కులు రావడంతో రూ.వెయ్యి ఫీజు కట్టి రీవెరిఫికేషన్ కు అప్లై చేసింది. ఆన్సర్ షీటు చూశాక మార్కుల్లో తేడా కనిపించింది.

ముందుగా 97 వేసి.. ఆ తర్వాత 77కు కుదించినట్టు ఆమె నిర్ధారించుకున్నది. ఈ విషయాన్ని కాలేజీ లెక్చరర్లతో పాటు ఈ నెల 20న ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకుపోయింది. అయినా, ఇప్పటికీ దానిపై ఎలాంటి చర్యలు కనిపించలేదు. ఆన్సర్ షీట్ వాల్యువేషన్ ఇష్టానుసారంగా చేసినట్టు స్పష్టమవుతున్నది. ఎగ్జామినర్ ముందుగా 77 మార్కులు వేశారు. అయితే, కౌంటింగ్ లో 97 వచ్చినట్టుగా తప్పు గుర్తించిన స్క్రూటినైజర్.. ఎగ్జామినర్ దృష్టికి తీసుకుపోయినట్టు తెలుస్తున్నది. దీంతో ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మొత్తం పేపర్ లో వేసిన మార్కులను తగ్గిస్తూ.. చివరికి 77కు తగ్గించినట్టు తెలుస్తున్నది.

రీవెరిఫికేషన్ చేసిన ఎగ్జామినర్ కూడా.. ఈ తప్పును గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఈసారి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం 48వేల మంది దరఖాస్తు చేసుకోగా, సుమారు 70 మందికి 2 నుంచి 10 మార్కుల వరకూ పెరిగినట్టు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. కాగా, సంహితకు సంబంధించిన పేపర్ వాల్యువేషన్ నల్లగొండలో జరిగినట్టు తెలుస్తున్నది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నది.

న్యాయం చేస్తం
సంహిత పేపర్ వాల్యువేషన్ అంశం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నాం. స్టూడెంట్ కు నిజంగా అన్యాయం జరిగితే.. తప్పకుండా న్యాయం చేస్తం. తప్పుచేసిన వారిపైనా చర్యలు తీసుకుంటం.

  • జయప్రద బాయి, ఇంటర్ బోర్డు సీవోఈ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

If you get 97 marks, you scored 77.. Ishta Rajya in the evaluation of inter papers