![WhatsApp Image 2024 05 23 at 16.07.43](https://trinethramnews.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-23-at-16.07.43.jpeg)
Kakinada District General Manager under ACB
Trinethram News : కాకినాడ జిల్లా : ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు.
కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ రూ.2 లక్షలు మురళి డిమాండ్ చేసారు.
బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండ్‌గా అధికారులు పట్టుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Kakinada District General Manager under ACB](https://trinethramnews.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-23-at-16.07.43.jpeg)