Karampudi Sarpanch Tejanayak in police custody
Trinethram News : పల్నాడు జిల్లా కారంపూడి
ఇటీవల కారంపూడిలో జరిగిన టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ నేపథ్యంలో గొడవలలో కారంపూడి సర్పంచ్ రామావత్. తేజానాయక్ పాత్ర ఉందని భావించిన పోలీసులు మంగళవారం అర్థరాత్రి మూడు గంటల సమయంలో సర్పంచ్ ఇంటికి వచ్చి సర్పంచ్ ను తీసుకొని వెళ్లినట్లు సర్పంచ్ కుటుంబసభ్యులు తెలిపారు.
గత రెండు రోజుల నుండి తేజానాయక్ స్థానిక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పేటసన్నేగండ్ల గ్రామంలో పోతురాజుగుట్టలో జరిగిన గొడవలలో ఒక వైసీపీ కార్యకర్తను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి.
రామకృష్ణరెడ్డి పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి ప్రోటోకాల్ లో భాగంగా అక్కడకు వెళ్లడం జరిగిందని ఆ సమయంలో స్థానిక సత్యన్నారాయణ డాక్టర్ హాస్పిటల్ వద్ద టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో తేజానాయక్ ను పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
ఇది ఇలా ఉండగా సర్పంచ్ కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ తేజానాయక్ కు ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని అయన బీపీ, షుగర్ తో బాధపడుతున్నారని ఇటీవలనే గుండె సంబంధిత రోగానికి గురై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
అంతేకాకుండా జరిగిన గొడవకు తమకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు ఈ విషయాన్నీ గ్రహించాలని కుటుంబసభ్యులు పోలీస్ శాఖను కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App