WhatsApp Image 2024 04 10 at 4.58.33 PM
Trinethram News : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద బుధవారం ప్రమాదవశాత్తు బొలెరో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. బొలెరో వాహనంలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చిన్నబోయిన పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
