రేపటి నుంచి వైయస్‌ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం నుంచి మూడు రోజులు వైయస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలో బయల్దేరి కడప చేరుకుంటారు..
గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలో ఎండీఎఫ్, హెచ్‌పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి ఆ సంస్థ ఛైర్మన్, ఉద్యోగులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం రిమ్స్ వద్ద వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైఎస్సార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, రిమ్స్ ప్రాంగణంలో వైఎస్సార్ క్యాన్సర్ బ్లాక్ ప్రారంభిస్తారు. తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రితో పాటు కడపలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రాత్రికి ఇడుపులపాయ చేరుకుని అక్కడే బస చేస్తారు..
ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, తర్వాత జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 25న ఉదయం పులివెందుల చేరుకుని అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత తాడేపల్లికి బయల్దేరనున్నారు..