Trinethram News : వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి.
మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. పెన్షనర్లు భయపడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు కడుపు మంట తోనే వాలంటీర్ల సేవలను ఎలక్షన్ కమిషన్ ద్వారా నిలుపుదల చేశారని విమర్శించారు.