అంగన్వాడీల పోరాటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మద్దతు

TRINETHRAM NEWS

అంగన్వాడీల పోరాటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మద్దతు

అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగనవాడి కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంగన్వాడీలకు వెంటనే కనీస వేతనాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

You cannot copy content of this page

Scroll to Top