Trinethram News : న్యూ ఢిల్లీ :డిసెంబర్ 11
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది.
కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్డిలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసు కోలేమని స్పష్టం చేసింది. తీర్పును చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ చదివి వినిపి స్తున్నారు.
భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్న ప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించింది.
మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.
రెండు ఉద్దేశాల కోసమే ఆర్టికల్ 370 నాడు ఏర్పటైందని తెలిపింది.