పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

TRINETHRAM NEWS

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి

ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయ కుమార్ శనివారం తెలిపారు.

విద్యార్థులు ఇంటి వద్ద నుండి పరీక్ష కేంద్రం వరకు అన్ని పల్లెవెలుగు మరియు ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులు కేవలం హాల్ టికెట్ ను చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆయన అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచి ఉత్తీర్ణులు కావాలని ఆయన ఆకాంక్షించారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి శుభాకాంక్షలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top