జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 20 at 8.39.03 PM

TRINETHRAM NEWS

బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్…

Date : 20 December 2023

తెలంగాణ / హైదరబాద్ : బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్… రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల చేస్తోంది.తాజాగా నాలుగు కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న 402 టెస్టులు చేయగా.. వాటిలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. కాగా.. గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటుచేశారు. మొత్తం 9 మంది కరోనా ఐసోలేషన్‎లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

You cannot copy content of this page