TRINETHRAM NEWS

Trinethram News : TS: మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభించనున్నారు. సంఘాలకు ₹కోటి వరకు రుణం, ఒక్కో సభ్యురాలికి ₹5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఎవరైనా మరణిస్తే, వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది.