ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు అన్నారు.
జగ్గయ్యపేట పట్టణం, డిపో సెంటర్ సామినేని విశ్వనాథం కార్మిక నగర్ నందు పిటిడి వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ పిటిడి వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలోనికి విలీనం చేసి లక్షలాదిమంది ఉద్యోగుల జీవితాలకు ప్రగతిబాట వేశారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చల్ల చంద్రయ్య, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ, ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కటారి హరిబాబు, పట్టణ పిటిడి వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.