Trinethram News : విజయవాడ: పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు..
తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు..
మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనకు భాజపా అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశంపై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం 9 జిల్లాలకు ఆ పార్టీ మేనిఫెస్టో రథాలను పంపనుంది..