ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 03 08 at 17.14.55

TRINETHRAM NEWS

Trinethram News : పుట్టపర్తి: తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు..

పుట్టపర్తిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. తెదేపా బలం కార్యకర్తలని.. నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారేనని అన్నారు..

”వైకాపా నాయకులు, కార్యకర్తలకు భూంభూం, ప్రెసిడెంట్‌ మెడల్‌ కావాలేమో.. తెదేపా కార్యకర్తలు మాత్రం పార్టీ అధ్యక్షుడి పిలుపు ‘రా.. కదలిరా’ అంటే తరలివస్తారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాం. పలువురు కార్యకర్తల పిల్లల్ని నా తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారు. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు.. కానీ ఎన్టీఆర్‌ నాకు 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారు..

తెదేపా నేతలు, కార్యకర్తలపై 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమ కేసులు పెట్టారు. నాపైనా 22 కేసులు నమోదు చేశారు. జగన్‌కు ఆనాడే చెప్పా తగ్గేదే లేదని. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైకాపా నాయకుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయి. మేం ప్రజాధనాన్ని లూటీ చేయలేదు, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదు, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులం కాదు. గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే మొదట ఫోన్‌ చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ఆయన ఒక అన్నగా నిలబడతానని నాకు చెప్పారు. ఆరోజు పవన్ విమానంలో రావాలంటే అనుమతి ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో అడ్డుకున్నారు. అందుకే తెదేపాతో కలిసి వైకాపాను ఓడించాలని ఆయన నిర్ణయించుకున్నారు” అని లోకేశ్‌ అన్నారు..

You cannot copy content of this page