మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని పల్లకి సేవలో పాల్గొన్న కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలో నెలకొన్న అతి పురాతన శివాలయం అయిన (భౌరమ్మ గుడి) శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి ఊరేగింపు లో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వామి వారికి పల్లకి సేవ చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు శివరాత్రి జాగరణ కొరకై బస్టాండ్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వాహుకులకు మరియు పోటీలో పాల్గొన్న యువకులకు అభినందనలు తెలియజేశారు. గ్రామ ప్రజలందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు మరియు యువకులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top