జీవనోపాధిని కల్పించి ఆదుకోవటం ఆదర్శనీయం : మారెళ్ళ
ఒంగోలు:20-12-23:ఆపదలో ఉన్న మహిళకు జీవనోపాధిని కల్పించి ఆదుకోవటం సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తుందని ప్రముఖ సంఘసేవకులు మారెళ్ళ సుబ్బారావు అన్నారు.
మంగళవారం సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భాషా ఆధ్వర్యంలో చైతన్య కాలనీకి చెందిన వారికుంట్ల శ్రావణి జీవనోపాధి కోసం ప్లాస్టిక్ సామాన్లు విక్రయ తోపుడు బండిని ఏర్పాటు చేశారు.
ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ భాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదరాలైన శ్రావని భర్త బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తు గుండెపోటుతో మరణించాడని, వారికి ముగ్గురు పిల్లలని,ఏ ఆధారం లేని నిరుపేద శ్రావణికి ఈరోజు సూర్య శ్రీ ట్రస్ట్ కార్యాలయం నందు ఆమె జీవనోపాధికి బండి ప్లాస్టిక్ సామాన్లు ప్రవాస భారతీయులు ఈదర సురేష్ సహకారంతో ఏర్పాటు చేసామన్నారు. నిరుపేదలకు సూర్య శ్రీ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో జనసేవ నాయకులు శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనివాసరావు,సిపిఎం నాయకులు ధారా వెంకటేశ్వర్లు,సుబ్బారెడ్డి ట్రస్టులోని దివ్యాంగులు పాల్గొన్నారు.