తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర నెట్‌వర్కను విచ్చిన్నం చేశారు.
ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఉన్న నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఛాక్ పీస్ పౌడర్‌తో మందులు తయారు చేసే ముఠాను పట్టుకున్నారు
ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ సుద్దపొడితో తయారు చేసిన మందులను తెలంగాణకు విక్రయించింది.
తయారు చేసిన మందులను సిప్లా, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే), ఆల్కెమ్.. అరిస్టో వంటి ప్రఖ్యాత కంపెనీల లేబుల్‌లు ఉన్నాయి. అయితే అవి నిజానికి ఛాక్ పీస్ పౌడర్‌తో తయారు చేసిన మందులు.
ఆగ్మెంటిన్ – 625, క్లావమ్ – 625, ఓమ్నిసెఫ్-ఓ 200, మాంటైర్ – ఎల్‌సి నకిలీలను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా పంపుతున్నట్లు నిందితులు అంగీకరించారు.