కొడుకు స్పీచ్‌.. ముఖేష్‌ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్‌

TRINETHRAM NEWS

Trinethram News : రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది.

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్‌ అంబానీ ప్రసంగించారు.

తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.

అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్‌ గురించి అనంత్‌ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ మారింది.

You cannot copy content of this page

Scroll to Top