TRINETHRAM NEWS

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది.

ఉదయం 8.30కు తెలంగాణ భవన్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది.

అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్‌లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది.

మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శిస్తుంది…