Trinethram News : దిల్లీ: దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. దిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు..
ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ముగ్గురు నిందితులను దిల్లీలో అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ భారత్ సహా, మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు వెల్లడించారు.