చీరాల పట్టాభి స్వీట్స్ లో అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

చీరాల పట్టాభి స్వీట్స్ లో అగ్ని ప్రమాదం…

చీరాలలో ప్రసిద్ధిగాంచిన పట్టాభి స్వీట్స్ దుకాణంలో మంగళవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది.

దుకాణంలో నుండి మంటలు వస్తుండడంతో స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పివేశారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నామని వారు తెలిపారు.

కాగా దాదాపు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు దుకాణం యజమానులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

You cannot copy content of this page

Scroll to Top