రాష్ట్ర సచివాలయంలో సీపీఐ వినతి.
మేడ్చల్ జిల్లా గాజులరామరం డివిజన్ సర్వే నెంబర్ 326,329,307,342 లలో అక్రమంగా నిర్మించబడిన 2500 గృహాలను కూల్చివేయ్యాలని మీరు గత సంవత్సరం మే నెల 13 వ తేదీన జారీచేసిన ఆదేశాలను ఇప్పటివరకు అమలు చేయకుండా మరిన్ని అక్రమ నిర్మాణాలు ఏర్పడుతున్నాయని కావున వెంటనే వాటిని కూల్చివేయ్యకుండా తాత్సారం చేస్తున్న అధికారుల పై చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను కూల్చివేయ్యాల్సిందిగా నేడు సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి,హరినాథ్, నాయకులు ప్రభాకర్ నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మునిసిపల్ సెక్రెటరీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రభుత్వ భూమిని దళారులు పేద ప్రజల నుండి 10 నుండి 15 లక్షలు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, దీని పై సీపీఐ అనేక పోరాటాలు చేసి,పత్రికలలో వార్తలు వస్తే నాడు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి 2500 అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే కూల్చివేయ్యాల్సిందిగా మునిసిపల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జరిచేసారని కానీ కలెక్టర్, ఆర్ డి ఓ,ఎమ్ ఆర్ ఓ లు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంకా వేలాదిగా కొత్త నిర్మాణాలు వెలిసాయని,అపుడపుడు తూతుమంత్రంగా చర్యలు తీసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని వెంటనే మీరిచ్చిన ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.