Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 10
వేములవాడ రాజన్న ఆలయం లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తో పాటు సులబ్ కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీసు శనివారం ఏఈఓ హరి కిషన్ కు అందజేశారు.
రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి. పర్మినెంట్ చేయాలని అన్నారు. కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు…