WhatsApp Image 2024 02 10 at 13.39.48
హైదరాబాద్ : ఫిబ్రవరి 10
గత నెల జనవరి 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిట్టిన మహిళ ఘటన మరవక ముందే.. తాజాగా రాజేంద్రనగర్ లో సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రసన్న అనే మహి ళా ప్రయాణికురాలు రెచ్చి పోయింది. అంతేకాదు బస్సు కండక్టర్ నరసింహ పై దాడి చేసింది. చెప్పు తీసుకొని కండక్టర్ చెంపలు వాయించింది ప్రసన్న. తాను అడిగిన చోట బస్సుని నిలపలేదనే కోపం తో కండక్టర్ ని దుర్భా షలా డుతూ..ప్రసన్న విచక్షణా రహితంగా దాడి చేసి చెప్పు తో కొట్టినట్లు తెలుస్తోంది.
దీంతో బస్సు కండక్టర్ నరసింహ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ప్రయాణీ కురాలు ప్రసన్నపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ మహిళా ప్రయాణీకురాలు ప్రసన్న శివరాంపల్లికి చెందిన మహిళగా గుర్తించారు.
