Trinethram News : హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. 6.5 లక్షల మంది రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు.
మరోవైపు సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లేందుకు భారాస నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని శాసన మండలికి వచ్చిన భారాస ఎమ్మెల్సీలను తొలుత భద్రతా సిబ్బంది అనుమతించలేదు. కాసేపు వాగ్వాదం తర్వాత లోపలికి పంపించారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు
Related Posts
గురుకుల విద్యార్థినికి కవిత పరామర్శ
TRINETHRAM NEWS గురుకుల విద్యార్థినికి కవిత పరామర్శ Trinethram News : కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ, కుటుంబసభ్యులను పరామర్శించనున్న ఎమ్మెల్సీ కవిత.. ఇటీవల గిరిజన బాలికల…
25న బీసీల సమరభేరి
TRINETHRAM NEWS 25న బీసీల సమరభేరి..!! జనగణనలో కులగణన చేపట్టాలిబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యTrinethram News : హైదరాబాద్, నవంబర్ 23 : జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు…