
జగద్గిరిగుట్ట డివిజన్ లో 4.00 కోట్ల రూపాయల నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …
MLA KP Vivekananda : త్రినేత్రం న్యూస్ : మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా దేవమ్మ బస్తి, మైసమ్మ నగర్, వాంబే కాలనీ, భూదేవి హిల్స్, మద్దూర్ నగర్, సీసాల బస్తి, రింగ్ బస్తి, భగత్ సింగ్ మార్గ్ వంటి ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
🪴మౌలిక వసతుల అభివృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణాలు, మన అభివృద్ధి సాధ్యమని అన్నారు.
🪴మౌలిక వసతుల కల్పనలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరచామని, రానున్న రోజుల్లో జగద్గిరిగుట్ట డివిజన్లోని ప్రతి కాలనీలో పూర్తిస్థాయి మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, పార్టీ అధ్యక్షులు రుద్రా అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, ఆయా కాలనీల వాసులు బసవేశ్వర్, మహేందర్, బ్రహ్మానంద చారి, ముఖేష్, రవి సాగర్, విటల్, త్రివేణి, మల్లాచారి, సురేష్, రాము, ముంతాజ్ అలీ, పాషా బాయ్, రాములు, రషీద్, ఆజమ్, మహమూద్, హాజీ, చంద్రశేఖర్, రాజేష్, విగ్నేష్, గణేష్ గౌడ్, పాపులు గౌడ్, యాదగిరి, మల్లారెడ్డి, శోభ, మంజుల, సీనియర్ నాయకురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు మెట్ల శీను, శశిధర్, జై హింద్, సాజిత్, ముంతాజ్, నాగరాజు, కయ్యుం, ఎర్ర లక్ష్మయ్య, మహేందర్, మహమ్మద్, సన్నీ, కన్నప్ప, అయోధ్య, అంజయ్య, పరశురాం, శీను తదితరులు పాల్గొన్నారు.