
–యాసంగిలో వరి పంట కు బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలి.
—మండల వ్యవసాయాధికారి రెహానా.
Crop Loss : డిండి( గుండ్లపల్లి ) నవంబర్ 05, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరువు మండలంగా ప్రకటించబడిన డిండి (గుండ్లపల్లి )మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలు, పంట నష్టానికి సంబంధించిన వివరాల సేకరణ జరుగుతుంది
వ్యవసాయ శాఖ ఏఈవోలు గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి, పంట నష్టం జరిగిన రైతుల వివరాలు, పంట నమోదుకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.పంట నష్టం జరిగిన రైతులందరూ తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు అందుబాటులో ఉండి, తమ పంట పొలాలను అధికారులకు చూపించి అవసరమైన వివరాలను అందించాలి.
ఇట్టి అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. పంట నష్టం వివరాల సేకరణ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలనీ మండల వ్యవసాయాధికారి రెహానా తెలిపారు.
యాసంగి లో వరికి బదులుగా ఆరుతడి పంటలు ..ఎల్ నీనో ప్రభావం దృష్ట్యా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి దీనితో వ్యవసాయ బావులు బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది కావున రైతులు యాసంగిలో వరి పంటను సాగు చేయవద్దని సూచించారు. పంటల మార్పిడి విధానాన్ని అవలంబించి ఆరుతడి పంటల సాగు పై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. సబ్సిడీ పై పెసర మరియు మినుములు విత్తనాలు అందుబాటులో వున్నాయి. కావాల్సిన రైతులు వ్యవసాయ విస్తరణాధికారులని సంప్రదించాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe