
— ఆర్ టీ సీ కార్మికుడు పెంటోజీ నిరాహార దీక్షకు సంఘీ భావం .
Outstanding Dues : దేవరకొండ డివిజన్ నవంబర్ 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణములో రిటైర్డ్ ఆర్ టీ సీ ఉద్యోగి దబ్బేకార్ పెంటోజీ రాష్టంలో వున్న 18000 ఆర్ టీ సీ కార్మికుల పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనీ చేసేటటువంటి నిరాహార దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు సంగీభావం ప్రకటించింది ..
ఈ సందర్భంగా సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమస్యలను నెరవేర్చాలని, సామాజిక ఆర్థిక అనారోగ్య పరిస్థితుల దుష్ట గత తొమ్మిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను తక్షణమే విడుదలచేయాలని, రావాల్సిన నెలవారిపెన్షన్, నాలుగు సంవత్సరాలకు రావాల్సిన తక్షణమే అమలు చేయాలని, రావాల్సినటువంటి బెనిఫిట్ తక్షణమే విడుదల చేయాలి లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలునుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ముందుకెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పున్న వెంకటేష్ అప్పం వీరయ్య, గడ్డం బిక్షమయ్య, కొండోజు శ్రీనివాస్ చారి , బొమ్మ శ్రీనివాస్ యాదవ్ , దుడ్డు దశరథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe