
Vote for Pot : డుంబ్రిగూడ,నవంబర్ 4, (త్రినేత్రం న్యూస్): డుంబ్రిగూడ మండలం అరకు సెగ్మెంట్‌లో స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి బస్కి బర్కి చెల్లమ్మ కుండ గుర్తుపై పోటీ చేస్తూ చివరి రోజు అరకు సెగ్మెంట్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తనకు ఒక్క అవకాశం కల్పించి కుండ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు అందరూ, కుండ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెల్లమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe