నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
MLA Maddipati Venkataraju

MLA Maddipati Venkataraju : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01 ; ద్వారకాతిరుమల మండలం, జగన్నాధపురం, రాఘవపురం, లక్ష్మీపురం, కొత్తపల్లి , కోడిగుడెం, పోతేపల్లి గ్రామాలలో డైనమిక్ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. ఆయన మాట్లాడుతూ, కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులను చేసామని తెలిపారు.

సంక్షేమాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలని పేర్కొన్నారు. దేశంలో ప్రధాన మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి, సంక్షేమంతో దూసుకుపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page