అక్టోబర్ 30, 2026
TRINETHRAM NEWS
Inspection cyclone-affected

ద్యాన పంటల రక్షణకు రైతులకు అధికారుల సూచనలు మరియు అంచనా వేసే క్రమాన్ని జిల్లా ఉద్యాన అధికారి ఎన్ మల్లికార్జున రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Inspection Cyclone-affected : త్రినేత్రం న్యూస్ : అర్ణబ్ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల మరియు ఈదురు గాలులు నేపథ్యంలో , ఉద్యాన పంటలు, ముఖ్యం గా కూరగాయలు, పూల తోటలకు , అరటి, బొప్పాయి వంటి పంటలు కు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కడియం మండలంలోని మురమండ గ్రామం కు జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జున రావు మరియు స్థానిక ఉద్యాన అధికారి డి. సుధీర్ కుమార్ వారు ఈరోజు 30-10-2026న క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంటల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ముఖ్యంగా అరటి, బొప్పాయి వంటి పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పంట నష్టాలను అంచనా వేస్తున్నట్లు రైతులకు వివరించారు.
నర్సరీ మొక్కల సంరక్షణ: నర్సరీల్లోని చిన్న మొక్కలను గట్లపై, మెరక ప్రాంతాల్లో లేదా ఎత్తైన మడులపై ఉంచడం ద్వారా నీటి ముంపు నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. పడిన మొక్కలు లను సపోర్ట్ కర్ర లు తో కట్టి జాగ్రత్త పడాలని. వర్షాలు తగ్గిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ (COC) లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదళ్ల వద్ద, పైభాగంలో పిచికారీ చేయాలని తెలిపారు. పొలాల్లో నిలిచిన నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలని సూచించారు. బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు కనిపిస్తే వర్షాలు తగ్గిన అనంతరం సంబంధిత మందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలని తెలిపారు. మొక్కలకు పోషకాలు అందించేందుకు 19-19-19 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని వివరించారు.
పూల తోటలకు ప్రత్యేక సూచనలు: పూల మొక్కలకు పోషకాలు అందించేందుకు 13-45-13 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 2–3 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. ఆకు మచ్చ తెగులు నివారణకు ప్రాపికోనజోల్‌ను లీటరు నీటికి 1.5 మి.లీ. చొప్పున వినియోగించాలని తెలిపారు. లేత మొక్కల్లో వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి వేర్ల ప్రాంతం తడిచేలా అందించాలని సూచించారు.
కూరగాయల మొక్కలు నీటి ముంపు ప్రభావం నుంచి కోలుకునేందుకు 2 శాతం యూరియా ద్రావణాన్ని మొక్కలు తడిచేలా రెండుసార్లు, వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే మల్టీ-కే (13-0-45) ఎరువును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయని వివరించారు.
భారీ వర్షాల వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో పారుదల సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో స్థానిక రైతు సేవా కేంద్ర సిబ్బంది, ఆ గ్రామా రైతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page