అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Unanimous Election

Unanimous Election : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 28, త్రినేత్రం న్యూస్. టీఎస్‌యూటీఎఫ్ డిండి (గుండ్లపల్లి) మండల మహాసభ దేవరకొండలో బుధ వారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా గండమళ్ళ రామారావు, ప్రధాన కార్యదర్శిగా నారోజు పవన్, ఉపాధ్యక్షులుగా కె.హరిలాల్, ఎం.సుజాత, కోశాధికారిగా ఖాజా రహమతుల్లా, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్‌గా వై.అమరేందర్, మహిళా కన్వీనర్‌గా జి.అరుణ, సోషల్ మీడియా కన్వీనర్‌గా సందీప్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి&జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగులకు వెంటనే పి ఆర్ సీ ప్రకటించి,పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 1, 2 తేదీల్లో కట్టంగూరులో జరిగే ఏడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పూర్యా, రామలింగం ,సరిత, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page