
Voter Registration Process : త్రినేత్రం న్యూస్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ డివిజన్ మల్లంపేట్ సాయి బాలాజీ కాలనీలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస అభ్యర్థి విజయానికి కాలనీ సభ్యులు, పార్టీ నాయకులు కృషి చేయాలని దుండిగల్ పురపాలక తొలి చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సాయి బాలాజీ కాలనీలోనీ నాయకులు కాలని సభ్యుల నమోదు ప్రక్రియ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన పట్ట భద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, మాదాస్ వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, బీఆర్ఎస్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్పేట్ రంగయ్య, మాజీ వార్డు సభ్యులు బాల కృష్ణ, నాయకులు అశోక్, బీఆర్ఎస్వి నాయకులు కుంట్ల మనీష్, మరియు కాలనీ సభ్యులు, జైవీర్, భూపాల్, శ్రవణ్, రమేష్, సుంకన్న, లక్ష్మీనారాయణ, రాజేందర్ రెడ్డి, దశరథ్ మరియు తదితరులు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe