
Donation Government Pensioners : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తూ నిర్మాణ నిధికి శ్రీమతి కొత్త లక్ష్మి భర్త బలరాములు రిటైర్డ్ టీచర్ రూ. 5,116 విరాళం తన భర్త 65వ పుట్టినరోజు రోజు సందర్బంగా కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరు లింగయ్యలకు అందజేసినారు.
ఈ సందర్బంగా లక్ష్మి మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన పెన్షనర్స్ సంఘం కార్యవర్గంనకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, కార్యవర్గం సభ్యులు ముసిని వీరయ్య, సల్వాది పెద్దులు, అప్పం వీరయ్య, అలంపల్లి శ్రీనివాసులు, లక్ష్మానాచారి, అస్సం పాండరయ్య, కర్నాటి సత్యనారాయణ, మహమ్మద్ మౌలానా,తాడూరు సత్యనారాయణ తదితరులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంట్లోనే సులభంగా మరియు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి బెస్ట్ డివైజ్!