సెప్టెంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Chakali Ailamma Jayanti

Chakali Ailamma Jayanti : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎన్ వీ టి గౌరవాధ్యక్షులు కే పంతులాల్ నాయక్ సభ్యులతో, విద్యార్థులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెప్టెంబరు 26, 1895 న వరంగల్ జిల్లా (ప్రస్తుత జనగామ జిల్లా) లోని కిష్టాపురంలో జన్మించినారని, భుక్తి కోసం, భూమి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నాటి భూస్వాముల రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించారని, మహిళా ధైర్యం చట్టాలు, న్యాయస్థానాల ద్వారా పోరాడి గెలిచి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్న గొప్ప ప్రజాస్వామిక పోరాట యోధురాలు అని, దేశం కోసం పోరాడిన పోరాట యోధులను మరవరాదని వారి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, డీ ఎస్ ఏ డాన్స్ మాస్టర్ క్రాంతి పీ శ్రీనివాస్, వలమల్ల ఆంజనేయులు, కౌన్సిలర్ సాయి చంద్ర గౌడ్, J చంద్రయ్య పి డీ, ఇద్దయ్య, రాజేష్ ,రఘు ,వెంకటేష్, సోమన్న ,రాము, రాజు, క్రీడాకారులు కళాకారులు విద్యార్థులు పాల్గొన్నారు.

జుట్టు రాలడం మరియు పల్చబడటానికి బెస్ట్ సొల్యూషన్! 💇‍♀️
లోపలి నుండి పోషణనిచ్చే బయోటిన్ గమ్మీస్ మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే రోజ్‌మేరీ రోల్-ఆన్ సీరమ్‌ల పవర్‌ఫుల్ కాంబో Be Bodywise Hair Growth Pack ఇప్పుడే ఆర్డర్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page