
Distribution Agricultural Resources : త్రినేత్రం న్యూస్,కడియం : నేలలో సూక్ష్మజీవుల సాంద్రతను పెంచడంతో పాటు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివిధ వ్యవసాయ వనరులను అందజేస్తోందని కడియం మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ అన్నారు.
శనివారం కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎటిఎంఎ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) సౌజన్యంతో వ్యవసాయ, ఉద్యాన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది రైతులకు వ్యవసాయ వనరుల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ.. వేప నూనె, నానో యూరియా, నానో డీఏపీ, 19-19-19 సూక్ష్మ పోషకాలు, బయోచార్ తదితరాలతో కూడిన ఈ కిట్లను వినియోగించడం ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ నేలలో సూక్ష్మజీవులు, మిత్ర పురుగుల సాంద్రత పెరిగేలా రైతులు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు వినియోగించే వ్యవసాయ వనరులు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారాన్ని కాపాడేందుకు సహజ, సమగ్ర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ముద్రగడ జెమీ, పంతం గణపతి, గట్టి నరసయ్య, నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, అధిమూలం సాయిబాబా, పుల్లా శ్రీను, వ్యవసాయాధికారి పీవీ శ్రీనివాస్, ఉద్యానాధికారి సుధీర్ కుమార్, పలువురు రైతులు, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe