సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
PM Modi Birthday Celebrations

బీ జె పి ఆధ్వర్యంలో విశ్వకర్మ , తెలంగాణ విమోచన దినోత్సవం.

PM Modi Birthday Celebrations : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 17, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రం లో గురువారం బీ జె పి పార్టీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి,ప్రధాని మోడీ జన్మ దినం మరియు తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి , పాలాభిషేకం పండ్లు మిఠాయిలు మరియు కేక్ కటింగ్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
డిండి బిజెపి మండల అధ్యక్షులు సింకారు సైదాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి మరియు దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ఏ టి కృష్ణ హాజరై ప్రధాని మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై ఓం చౌరస్తా వద్ద జాతీయ జెండా ఎగరవేసి మిఠాయిలు పళ్ళు పంచి ప్రధాని మోడీ జన్మదిన కేక్‌ను కట్ చేసి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ప్రధాని మోడీ క్షేమం కోసం వినాయకునికి పూజలు: గురువారం మోడీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే దేవీ దేవతామూర్తుల ఆశీస్సులు మన ప్రధానికి ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మాధవరం నరసింహారావు. ఎలకుర్తి జైపాల్. ఎలకుర్తి రమేష్. కందుకూరు సర్పంచ్ బరపటి కొండల్.ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి నల్లగంతుల వెంకటయ్య. జిల్లా కౌన్సిల్ సభ్యులు వావిళ్ల అంజి యాదవ్. పున్న దినేష్.మాధముని అమృత్ బాధమోని సాయి గౌడ్ . గాయాల రాఘవేంద్ర వావిళ్ళ రేణయ్య దండేడ్కర్ శీను. పులిజాల రమేష్.అజ్జు.కటికల సురేష్. అంజి.సాయి. భాస్కర్. చిరంజీవి.వెంకటయ్య. ప్రసాద్.వినోద్. సందీప్.అక్షిత్.మరియు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page