సెప్టెంబర్ 11, 2026
TRINETHRAM NEWS
Janasena

Janasena : అనంతగిరి, సెప్టెంబర్ 11, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని లంగుపర్తి పంచాయతీ పరిధి ఒనుకొండ గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మంచినీరు, రహదారి, బ్రిడ్జి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చిట్టం మురళి ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో ఫోన్‌లో మాట్లాడి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇతర సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాంగి లక్ష్మణ్, సాగర మధు, పంచాయతీ కార్యదర్శి కొర్ర మోహన్ చంద్ర, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page