సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Grand Farewell

– సేవలను కొనియాడిన సహచరులు, మిత్రులు

Grand Farewell : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 07, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం లోని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గ్రంథ పాలకుడిగా సేవలందించిన డాక్టర్ సుంకరి రాజారామ్ పదవీ విరమణ సందర్భంగా కళాశాల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి అధ్యక్షత వహించారు. వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, కళాశాల సీపీడీసీ, అలుమ్ని సభ్యులు, సుంకరి రాజారామ్ సన్నిహిత మిత్రులు, అధ్యాపకులు తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ, డాక్టర్ సుంకరి రాజారామ్ తన విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం అభినందనీయమని అన్నారు. గ్రంథాలయం విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే కేంద్రంగా నిలవడంలో ఆయన పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సీపీడీసీ, అలుమ్ని సభ్యులు డాక్టర్ సుంకరి రాజారామ్‌ను ఘనంగా సన్మానించి, పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, “పదవికి పదవీ విరమణ ఉన్నా… జ్ఞాన సేవకు, మంచి అనుబంధాలకు ఎప్పటికీ పదవీ విరమణ ఉండదు” అని పేర్కొన్నారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం డాక్టర్ సుంకరి రాజారామ్‌తో కళాశాల కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది. ఆయన సేవలను, స్నేహాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి లింగారెడ్డి ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ కె. పృథు, ఎన్సిసి ఆఫీసర్ ఆర్. నాగేంద్ర, తదితర కళాశాల అధ్యాపకులు అలాగే వివిధ కళాశాలల పిన్సిపల్స్ అధ్యాపకులు ,సన్నిహితులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page