సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Free Eye Camp

ఉచిత కంటిపొర శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

Free Eye Camp : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 07, త్రినేత్రం న్యూస్. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
సోమవారం దేవరకొండ మండలం పడమటిపల్లిలో పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీ మరియు హైదరాబాద్‌కు చెందిన శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కంటిపొర శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. కంటి సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని సూచించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రమావత్ రవీంద్ర కుమార్ కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, పి ఎ సీ ఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,స్థానిక సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి,నాగవరం వెంకటేశ్వర్ రావు ,వెంకటయ్య,మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, మాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొమ్ము రామస్వామి,యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page