Trinethram News : బాచుపల్లి: హైదరాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్ పట్నాయక్, శ్రీనివాస్‌గా గుర్తించారు..
కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల వాహనం నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు..