ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Constable Dileep Saves a Life

ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

Constable Dileep Saves a Life : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు.

బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు.

కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు.

“పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page