
Junior Doctors Boycott Emergency : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ :స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు..
అత్యవసర సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బందికి మెడికల్ లీవులతో పాటు ఇతర అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. అత్యవసర వైద్య సేవలు నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe