
YCP-Led Rally : అరకులోయ, ఆగస్టు 9, (త్రినేత్రంన్యూస్): 2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువ్యాలీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలో నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, అర్హులకు పోస్టులు కేటాయించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ర్యాలీ ఉదయం 10 గంటలకు అరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమై ఎమ్మార్వో కార్యాలయం వరకు కొనసాగనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe