
-ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
Jagadish Reddy Birthday Celebrations : దేవరకొండ డివిజన్ జులై 18, త్రినేత్రం న్యూస్ : దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజి శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ…. జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో జగదీష్ రెడ్డి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.
ఆయన చొరవతోనే ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లాలో రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తూ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకొని తిరిగిన నేతలకు ప్రజా తీర్పుతో ఓటమి చవిచూపించిన నాయకుడు జగదీష్ రెడ్డి అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీకి అంకితభావంతో సేవలందిస్తూ, జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసి ఉమ్మడి నల్గొండ రూపురేఖలను మార్చిన నాయకుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన పట్టుదల, నాయకత్వం వల్లనే జిల్లాలో ప్రతిపక్ష పార్టీల బలమైన కోటలు కూడా బీటలు వారాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe