
MLA Wife makes Sensational : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్: జూలై 09; పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం , రక్షకభట కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. రాజకీయం అనేది ఒక చదరంగం లాంటిదని తెలిపారు. కానీ అటువంటి రాజకీయాన్ని వ్యక్తిగత కుటుంబానికి సంబంధించి మాట్లాడితే అది ఎవరైనా సరే సహించేదే లేదని స్పష్టం చేశారు.
అయితే కొంతమంది రాజకీయ నాయకులు డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆ నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక, అదేవిధంగా ఆయన చేసే అటువంటి సేవ గుణాన్ని సహించలేక అణిచివేయాలన్నా ఆలోచనతో ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా మరియు కొన్ని పత్రిక,మీడియాలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి వాళ్లపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే చిర్రి బాలరాజు కష్టం తెలిసిన వ్యక్తి, ప్రజలకు మేలు మంచి మనసు ఉన్న మహానీయుడు ఆయన. ప్రజల సమస్యలను తన సమస్యలుగా గుర్తించి పరిష్కార మార్గంగా ముందుంటాడు.
గత ప్రభుత్వం వైసిపి హాయంలో చేయలేని అభివృద్ధిని, ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఆ సమస్యలకు పరిష్కారం దిశగా ముందుంటున్నాడు అనే సమాధానం నియోజకవర్గం ప్రజానికంలోస్పష్టంగా కనిపిస్తుంది. మరి అటువంటి వ్యక్తిని ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా ద్వేషించడం అనేది సమంజసం కాదు. ఇకపై తమ ఎవరు ఏమీ అనొద్దని, ఒకవేళ ఎవరైనా నోరు జారితే మాత్రం సహించబోమని డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు సతీమణి పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe